సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలిగిపోయంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడైన సిఎం రమేష్ దౌత్యం ఫలించింది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన చర్చలు ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి 48 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. దీంతో తెరాస జాబితా బుధవారం ఉదయం విడుదల చేయనుంది.
మహాకూటమి నుంచి విడిపోయి పోటీ చేస్తామా, కలిసి పోటీ చేస్తామా అనే విషయాన్ని వెల్లడించడానికి కెసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అనంతరం కెసీఆర్ మీడియా సమావేశాన్ని రద్దు చేసి, చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చంద్రబాబు కాళ్లబేరానికి రావడంతో తలొగ్గిన కేసీఆర్.. తెదేపా ఇస్తానన్న 48 సీట్లకు తలాడించారు. ఫలితంగా మహాకూటమిలో నెలకొన్న సీట్ల ప్రతిష్టంభన మంగళవారం సాయంత్రానికి తొలగిపోయింది. |