చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పేరుతో ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ధనరాజ్యంగా మారిపోయిందని ఆరోపించారు.
ఈ విషయం నిరూపితమయిందని విమర్శించారు. రోజా శుక్రవారం తిరుచానూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారాజ్యం పార్టీ తమ కోసం నిజంగా కష్టపడిన వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించకుండా, వాటిని అమ్ముకుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తమపై విమర్శలు మానుకొని, సొంత పార్టీ సంగతి చూసుకోవాలని కోరారు. |