ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రాష్ట్రంలో హంగ్ తథ్యం: వెంకయ్య జోస్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాష్ట్రంలో హంగ్ తథ్యం: వెంకయ్య జోస్యం
రాష్ట్రంలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కానుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎం.వెకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్న పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, తెదేపా, పీఆర్పీలు ఇస్తున్న హామీలు ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదని వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పార్టీ ప్రచారం కోసం విశాఖపట్నం వచ్చిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పక్కనబెట్టి రాజకీయ పార్టీలు అలవికాని హామీలకు, పరస్పర దూషణలకు ప్రాముఖ్యమిస్తున్నాయని పేర్కొన్నారు. అదేసమయంలో మీడియా సైతం ఈ తరహా వాటికే ప్రచారం కల్పిస్తున్నాయంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.

టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీలు గుప్పిస్తున్న హామీలు ఏమాత్రం అమలుకావని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాత్రివేళ ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంపై ఈసీ పునరాలోచించాలని కోరారు. రాత్రిపూట ప్రచారంవల్ల ఎన్నికల సమయంలో ధనప్రవాహం ఎక్కువవుతుందని ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మళ్లీ అధికార పీఠం కట్టబెట్టండి: వైఎస్
పీఆర్పీ ప్రజా రైలుకు విశేష స్పందన
కాంగ్రెస్ పథకాలన్నీ అవినీతి మయం: సీపీఎం
ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రజారైలు యాత్ర
అది ప్రజారాజ్యం కాదు, ధనరాజ్యం: టీడీపీ ఆరోపణ
11 నుంచి ప్రజారైలు యాత్ర: చిరంజీవి