కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లా బీర్కూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ, తమ ప్రధాన శత్రువు పేదరికమే అని పేర్కొన్నారు. తాను దేశంలో ఏ మూల పర్యటించినా ప్రజల బాధలను అడిగి తెలుసుకుంటాననీ, వారికి అతి చేరువగా వెళతానన్నారు.
అయితే తాను చేసే ఈ పనులన్నీ నాటకీయంగా ఉంటాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయనీ, ఏసీ గదుల్లో కూచుని చూసే ప్రతిపక్షాలకు పేదల కష్టాలు ఏం తెలుసని రాహుల్ ఎద్దేవా చేశారు.
పేదలకోసం ఆలోచించేదీ, వారికోసం పోరాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాహుల్ గాంధీ అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం, రుణమాఫీ, మహిళలకు పావలాకే వడ్డీకే రుణాలు వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననీ, అటువంటి పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. |