ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > యువరాజ్యం అధినేత పవన్‌కు స్వల్ప అస్వస్థత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యువరాజ్యం అధినేత పవన్‌కు స్వల్ప అస్వస్థత
యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్‌ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తొలివిడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో గత కొన్ని రోజులుగా క్షణం తీరికలేకుండా పాల్గొంటుండడంతో పవన్‌కు జ్వరం వచ్చిందని ప్రజారాజ్యం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో హైదరాబాద్‌కు చేరుకున్న పవన్‌కళ్యాణ్‌ను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో పవన్‌ను పరీక్షించిన వైద్యులు జ్వరం ఉన్న కారణంగా ఓరోజు పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఆస్పత్రికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌ను ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సతీమణి సురేఖ పరామర్శించారు. అలాగే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రావణ్‌కుమార్, అసెంబ్లీ అభ్యర్థి మేకల సారంగపాణి, కట్టెల శ్రీనివాసయాదవ్‌లు సైతం పవన్‌ను పరామర్శించారు. పవన్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే పార్టీ కార్యకర్తలతో సహా అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

తొలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి అంబర్‌పేట రోడ్డుషోలో ప్రసంగించిన అనంతరం పవన్ రాంనగర్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో కొంతదూరం వెళ్లాక కళ్లు తిరుగుతున్నాయని చెప్పి పవన్ కూర్చుండిపోవడంతో అనుచరులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నిరంతరంగా ఓట్లర్ల నమోదు చేస్తాం: ఈసీ
కటకటాల్లో సాయిలత చిట్‌ఫండ్ నిర్వాహకులు
మహాకూటమి విజయాన్ని అడ్డుకోలేరు: కేసీఆర్
పథకాల లబ్దిదారులే రియల్ స్టార్స్: వైఎస్
రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన కాంగ్రెస్: రాఘవులు
ఐదేళ్ళలో అవినీతికి వైఎస్ పెద్దపీట: చంద్రబాబు