మాజీ నక్సలైట్ జనగం శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం పోలీసులు తిరుపతిలో అరెస్ట్ చేశారు. పలు బెదిరింపు కేసుల్లో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ గత 15 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను అదిలాబాద్ జిల్లాకు చెందినవాడు.
రాష్ట్రంలోని ప్రముఖులైన వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని ఓ ప్రముఖ డాక్టర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండటంతో పోలీసులకు పట్టుబడ్డాడు.
ఇదిలావుండగా ఇతను ప్రముఖ నక్సలైట్ సెంట్రల్ కమాండర్ ఆసన్న పేరుతో డాక్టరును బెదిరించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా గతంలో ఇతను కాళంగిదళానికి చెందినవాడని వారు వివరించారు. |