స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. పార్టీలో తన అభిమానులకు పెద్దపీట వేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. ఆదివారం అభిమాన సంఘాల నేతలతో ఆయన పార్టీ ప్రధానకార్యాలయంలో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు అభిమానులకే కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోను అభిమానులకు దూరం అయ్యే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
పీఆర్పీ వందేళ్లు ఉండాల్సిన పార్టీ అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు. స్వార్థ ప్రయోజనాలు ఆశించే టికెట్లు రాని కొందరు అభిమానులు పార్టీని వీడారని విమర్శించారు. అయినా ఏం భయం లేదన్నారు. |