ఈనెల 16న జరుగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సిద్ధమయ్యే దిశగా మంగళవారం నమూనా కౌంటింగ్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 106 లెక్కింపు కేంద్రాల్లో ఈ నమూనా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
నమూనా కౌంటింగ్ సాగుతున్న లాల్ బహదూర్ స్టేడియంలోని కేంద్రాన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావు సందర్శించి అక్కడ కొనసాగుతున్న ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ను పకడ్బంధీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఆయన పేర్కొన్నారు. |