సత్యం సంస్థ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజు, ఆయన సోదరుడికి విధించిన రిమాండ్‌ను ఈనెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన రిమాండ్ కాలపరిమితి పూర్తయిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
సత్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న రామలింగరాజు సోదరులతో సహా మరో ఏడుగురిని పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా వీరివద్ద నుంచి సంతకాలు తీసుకున్న కోర్టు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్టు తెలిపింది. దీంతో పోలీసులు మళ్లీ వారిని జైలుకు తరలించారు. |