రాష్ట్రంలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిదిమంది మృతి చెందారు. ఈ ప్రమాదాల కారణంగా మరికొందరు సైతం గాయపడ్డారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని ముగ్గురు మృతి చెందారు. అలాగే గుంటూరు జిల్లా పేరేడుచర్ల వద్ద కారు, లారీ ఢీకొని నలుగురు మృతి చెందారు.
ఈ ప్రమాదాలతోపాటు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వద్ద ఆర్టీసీ బస్సు, జీపు ఢీకొన్న ఘటనలో జీపు డ్రైవర్ మృతి చెందగా ఇందులో ప్రయాణిస్తున్న ఎమ్మార్వోకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇక నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టెక్రియాల్ వద్ద మూడు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. |