ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రాష్ట్రానికి ముందుగానే రానున్న రుతుపవనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాష్ట్రానికి ముందుగానే రానున్న రుతుపవనాలు
మండుతున్న ఎండలతో కష్టాలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఓ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది జూన్ ఒకటిన కేరళలో అడుగుపెట్టే నైరుతి రుతుపవనాలు ఈసారి దాదాపు ఆరురోజుల ముందే రానున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

వివరాలలోకి వెళితే ఈనెల 26న నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ రుతుపవనాల కారణంగా దాదాపు 96శాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అదేసమయంలో రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చేవి కూడా నైరుతీ రుతుపవనాలే కావడంతో అందరిలో సంతోషం నెలకొంటుందని వాతావరణ శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. దీంతో రుతుపవనాల కారణంగానైనా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయోమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈనెల 26న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు అటుపై జూన్ 5నాటికి నెల్లూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి అటుపై 8నాటికి విశాఖ వరకు విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి
టీఆర్ఎస్ క్యాంప్ ప్రారంభమైంది...!
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి : ఈసీ
ధరల అదుపునకు ముఖ్యమంత్రి ఆదేశం
మెజారిటీని అనుసరించే క్యాంపు శిబిరం: అల్లు
"రాజు"గారి పాలనకు ఐదు సంవత్సరాలు