హైదరాబాద్‌లో గత ఏడాది సంభవించిన జంట పేలుళ్ల కేసులో ఆక్టోపస్ అధికారులు ఎట్టకేలకు ఛార్జిషీటును దాఖలు చేశారు. మొత్తం ఏడుగురిపై అభియోగాలు మోపుతూ 1207 పేజీల ఛార్జిషీటును అధికారులు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జిషీటును దాఖలు చేసేముందు అధికారులు మొత్తం 159 మందిని విచారించడం గమనార్హం.
హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీపార్కుల్లో సంభవించిన పేలుళ్లతో పాటు దిల్‌షుక్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద బాంబు పెట్టిన కేసులకు సంబంధించి ఆక్టోపస్ అధికారులు తమ ఛార్జిషీటులో పేర్కొన్న ఏడుగురిలో నలుగురు పోలీసులు అదుపులో ఉండగా, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసుల కస్టడీలో ఉన్నవారు ముంబై పోలీసులకు చిక్కడంతో వారిని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. |