తెలంగాణ జిల్లాలకు సంబంధించి మహాకూటమికే ఎక్కువ స్థానాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసిన కారణంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున నష్టపోనుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడంవల్ల పార్టీకి ఏమేరకు నష్టం కలిగిందనే విషయం కాంగ్రెస్‌కు శనివారం తెలుస్తుందన్నారు. తెలంగాణలో మహాకూటమే ఎక్కువ స్థానాలు గెలిచుకునే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అనుకూల నిర్ణయం తీసుకుని ఉంటే టీఆర్ఎస్‌తో పాటు సీపీఐ సైతం కలిసివచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. |