రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మళ్లీ వైఎస్సే ముఖ్యమంత్రి అవుతారని రవాణాశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. వైఎస్స్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ విజయవాడలో శుక్రవారం తలపెట్టిన లక్ష్మీ గణపతి యాగానికి మంత్రి కన్నా ముఖ్య అతిథిగా హాజరై యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని ఈ కారణంగా తాము మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. |