ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
దీనిపై రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి బీఎస్‌వీవీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. ఇదే విషయంపై ఇంటర్మీడియట్ బోర్డు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు.
కాగా, మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. కాగా, ఈ పరీక్షలను పురస్కరించుకుని విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను పరీక్షా కేంద్రాల వద్దకు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. |