ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించిందని తెలంగాణా అంశాన్ని చులకనగా భావించే ప్రసక్తే లేదని సత్యనారాయణ స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా బొత్సా స్టేడియంలో పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు. పలు పథకాలచే రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ సీఎం కావడం పట్ల సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. |