ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకున్నా అభిమానులు ధైర్యం కోల్పోరాదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. చిరంజీవి ముఖ్యమంత్రి కాలేదని కొందరు అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ విషయమై చిరంజీవి ప్రకటన చేస్తూ ముమ్మడివరంలో నల్లా నారాయణగిరి అనే ఆటోడ్రైవర్, దెందులూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల సతీష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అయితే పార్టీ విజయావకాశాలు ఎలావున్నా అభిమానులు మాత్రం ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడరాదని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో అధికారం అంతిమ లక్ష్యం కాదని, ప్రజాసేవే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. |