విశాఖ నగరాభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని విశాఖ లోక్‌సభ సభ్యురాలు, కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె శనివారం విశాఖలో పర్యటించి, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ నగరాభివృద్ధి కోసం తన శక్తిమేరకు కృషి చేస్తానన్నారు.
ముఖ్యంగా, విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధుల కేటాయింపునకు కృషి చేస్తానని, అలాగే, రైల్వే జోన్, కాలుష్య సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి కేంద్రీయ విశ్వవిద్యాలయం విశాఖకు సాధించి తీరుతామన్నారు. ఈ సందర్భంగా ఆమె తనను గెలిపించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. |