ఎంసెట్ ర్యాంకులను సాంకేతిక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆదివారం విడుదల చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ (జెఎన్‌టియు) ఎంసెట్ ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌కు 2,72,086 మంది, మెడిసన్‌కు 66,351 మంది అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో గన్నవరపు గోపాలకృష్ణ మూర్తి (విశాఖపట్నం), షేక్ అల్లావుద్ధీన్ (హైదరాబాద్), శివకుమార్ (హైదరాబాద్), వై. శ్రవణ్‌కుమర్ (హైదరపబాదు)లు టాప్5లో నిలవగా, మెడిసన్‌లో నల్లా రవీనా (హైదరాబాద్), సంతోష్ స్వామినాథన్ (హైదరాబాద్), కీర్తన (హైదరాబాద్), మేఘన (రంగారెడ్డి), రామకిషన్ (హైదరాబాద్)లు టాప్5లో స్థానం దక్కించుకున్నారు. |