2014 కల్లా రాష్ట్రాన్ని మురికి వాడలు లేని ప్రాంతంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి మురికి వాడల రహిత రాష్ట్రాన్ని రూపొందించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్‌లో వైఎస్ తన సచివాలయంలో మున్సిపల్ అధికారులను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్ పనులను వేగవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.
కాగా, నేడు పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద వైఎస్ ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌తో పాటు రాష్ట్ర గవర్నర్ ఎన్‌డి తివారీ, ఆర్థిక మంత్రి రోశయ్య తదితరులు కూడా ఉన్నారు. |