రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కరుడగట్టిన ముఠా నాయకుడిలాగా ప్రవర్తిస్తున్నాడని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. వీరిని పోలీసులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తమ ఎమ్మెల్యేలకు మద్దతుగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ముఖ్యమంత్రి తమ వాళ్లను వేధింపులకు దురిచేస్తున్నారని విమర్శించారు. మాకు 92 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి మా మద్దుతుంటుంది. కాని అధికార పక్షం మాత్రం మా వాళ్లను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు కళాశాలపై కేసు ఉందుకు ఉదాహరణ అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రక్తపు మరకలు కళాశాల గోడలకు ఉన్నాయని నమూనాలు పంపించారు.
అయితే అవి రక్తపు మరకలు కావని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. అయినా ఈ కేసును సీబీఐకి అప్పజెప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలపై కేసు పెట్టింది ఒక సాక్షి విలేఖరి అని తెలిపారు. ఇంత దిగజారుడుతనంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఇక మీ ఆటలు సాగనియ్యమని, అవసరమైతే జైలులో ఉండైనా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని చంద్రబాబు ఉద్ఘాటించారు. |