ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > కరీంనగర్‌లో అతిసారం: 50 మందికి అస్వస్థత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కరీంనగర్‌లో అతిసారం: 50 మందికి అస్వస్థత
కరీంనగర్ జిల్లాలో అతిసార వ్యాధి బారినపడి 50 మంది అస్వస్థతకు గురైయ్యారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలుతోంది. కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపురం పంచాయతీ పరిధిలోని మల్లుపల్లె గ్రామంలో అతిసార వ్యాధి సోకి శనివారం 50 మంది మంచంపట్టారు.

కలుషితమైన నీటి సరఫరా కావడం వలనే వీరికి వాంతులే, విరోచనాలతో పలువురు అస్వస్థతకు గురైయ్యారు. ఈ గ్రామానికి చెందిన పలువురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతిసార వ్యాధి సోకిందని సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది గ్రామంలో మకాం వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. పైప్‌లైన్‌ లీకేజీ మూలంగానే మంచినీరు కలుషితమయి అతిసార వ్యాధి సోకిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు ప్రతిపక్ష నేత
వైఎస్ ముఠా నాయకుడు: చంద్రబాబు
మురికివాడలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దండి: వైఎస్
తెరాస అసమ్మతివాదులపై సస్పెన్షన్ రద్దు: కేసీఆర్
బాబ్లీ వ్యవహారంపై మహారాష్ట్రకు లీగల్ 'నోటీస్'
దసరా తర్వాత ఆకస్మిక తనిఖీలు: వైఎస్