త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా విజయం కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలపై చర్చించేందుకు ఆయన సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మొయిలీ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తుల విషయం రాష్ట్ర నాయకత్వానిదే తుది నిర్ణయమన్నారు.
ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ సమావేశంలో చర్చించినట్టు ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమ పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, పి.సి.సి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. |