ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > రాష్ట్రంలో ఎన్ఎస్‌జీ కేంద్రాన్ని ప్రారంభించిన చిదంబరం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాష్ట్రంలో ఎన్ఎస్‌జీ కేంద్రాన్ని ప్రారంభించిన చిదంబరం
FILE
దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) కేంద్రాన్ని హోంశాఖామంత్రి పి. చిదంబరం బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి చిదంబరం మాట్లాడుతూ...ఇది తీవ్రవాదుల నియంత్రణలో గ్రేహౌండ్స్, స్థానిక పోలీసు శాఖలకు ఎలాంటి పోటీ కాదని ఆయన అన్నారు. ఈ సంస్థ ఆ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైందని, కేవలం ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ఈ సిబ్బంది రంగంలోకి దిగుతారని ఆయన అన్నారు.

శుశిక్షితులైన 240మంది కమెండోలు ఈ సంస్థలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా కేవలం 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి నాలుగు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

తొలుత మంగళవారం ఉదయం ఎన్ఎస్‌జీ కేంద్రాన్ని ముంబైలో ప్రారంభించామని, అలాగే కోలకతా, చెన్నైలలో మరో రెండు ఎన్ఎస్‌జీ కేంద్రాలనుకూడా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎంపీ మందా జగన్నాథంపై కేసు నమోదు
సహకార సేద్యానికి మంత్రిమండలి ఆమోదం
ఉదయ సూర్యునికే మొగ్గు చూపాం: చిరంజీవి
రామారావుకు సంఘీభావం ప్రకటించిన పీఆర్పీ
అనర్హులను తొలగించకండి: ముఖ్యమంత్రి
అభిమానుల్లారా.. క్షమించండి: చిరంజీవి