వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణా ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇన్నాళ్లు ఊరించిన రుతుపవనాలు మరింత ముందుకు పురోగమించాయి.
ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో ఐదు, తణుకు, చింతపల్లిలో నాలుగు, లక్సెట్టిపేట, తాడేపల్లిగూడెంలో మూడు, చోడవరం, నర్సీపట్నం, సాలూరు, సిర్పూరు, ఇచ్ఛాపురాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. |