దళితుడైన రామారావును వేధించడం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొవ్వూరు ఎమ్మేల్యే రామారావు విషయంలో నిర్దోషి అని తేలినా, ఆయనపై కేసులు ఎత్తివేయాలని విపక్షాలు, విద్యార్థులు కోరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాబు తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేస్తున్న రామారావు, ఆయన కుటుంబసభ్యులను చంద్రబాబు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఆయనపై కావాలనే కేసులు పెట్టి, ఏ పరీక్షలోనూ ఆయన నేరం చేసినట్లు నిర్ధారించలేకపోయారని తెలిపారు. అయినా రామారావుపై కేసులు ఎత్తివేయకుండా రామారావుకు పరువునష్టం కలిగించి వేధిస్తున్నారని బాబు వెల్లడించారు. కేసులు ఎత్తివేసేంతవరకు తమ పార్టీ తరపున ఆందోళనలు నిర్వహిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. |