ఉప్పునూతల గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌పై చేయిచేసుకున్న నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం ఎట్టకేలకు మేనేజర్‌కు క్షమాపణ చెప్పారు.
గురువారం ఢిల్లీకి వెళ్లిన మందా అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీతో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బ్యాంక్ మేనేజర్ రవీంద్రరెడ్డి, బ్యాంకర్లకు బేషరుతుగా క్షమాపణ చెపుతున్నట్లు ప్రకటించారు. మేనేజర్ రవీంద్రరెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని ఎంపీ వెల్లడించారు. |