రాష్ట్రంలో మహిళలపై దాడులు నానాటికి పెచ్చరిల్లిపోతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నన్నపనేని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా సంఘాలతో చర్చలు జరపడం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాజకుమారి తెలిపారు. డీజీపీ ఎస్ఎస్‌పీ యాదవ్ వైఖరి వల్లే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని రాజకుమారి ఈ సందర్భంగా విమర్శించారు. అందుకే మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. మహిళలపై దాడులు జరిపిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని రాజకుమారి డిమాండ్ చేశారు. |