పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచేది లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్పష్టం చేశారు. పెరిగిన ధరలో ఆర్టీసీపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ ప్రయాణీకులపై అదనపు భారం వేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని శత్రుచర్ల వెల్లడించారు.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో గురువారం రవాణా శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో శత్రుచర్ల మాట్లాడుతూ.. ఛార్జీలు పెంచడమా? వద్దా? అనే అంశంపై ఆర్టీసీ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే ప్రయాణీకులపై ప్రభుత్వం భారం మోపదని శత్రుచర్ల స్పష్టం చేశారు. |