ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > భూటాసింగ్‌ను కలిసిన టీడీపీ బృందం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భూటాసింగ్‌ను కలిసిన టీడీపీ బృందం
కొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసుల వ్యవహారంపై తెలుగుదేశం మరో అడుగు ముందుకేసింది. ఒక దళిత ఎమ్మెల్యేపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులను ఆపాలంటూ మైసూరా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బృందం న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ-ఎస్టీ కమిషన్ ఛైర్మన్ భూటాసింగ్‌‌ను కలిసింది.

దళిత ఎమ్మెల్యేపై వేధింపులను ఆపాలంటూ మైసూరారెడ్డి బృందం భూటాసింగ్‌కు ఓ వినతి పత్రం కూడా సమర్పించింది. దీనికోసం తెలుగుదేశం ఎస్సీ, ఎస్టీ విభాగం నేతలు బల్లి దుర్గాప్రసాద్, హనుమంతు షిండే, వర్ల రామయ్యతో కూడిన బృందం బుధవారం ఢిల్లీకి పయనమైంది.

ఇదిలా ఉండగా.. తనపై మోపిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. ఇందిరా పార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రామారావు కుటుంబ సభ్యులను, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామారావును చంద్రబాబు పరామర్శించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆర్టీసీ ఛార్జీలను పెంచేది లేదు: శత్రుచర్ల
అందుకే మహిళలపై దాడులు: నన్నపనేని
ఎగ్జిబిషన్ మైదానంలో "వరుణ యాగం" ప్రారంభం
సారీ మేనేజర్‌: మందా జగన్నాథం
రామారావును వేధించడం సరికాదు: బాబు
మాస్టర్ బ్లాస్టర్‌కు నెల్లూరులో రేషన్ కార్డులు!