పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. జంగారెడ్డి గూడెం మండలం వేగవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మంది గాయాల పాలయ్యారు. వేగవరం వద్ద వస్తోన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇదేవిధంగా.. కరీంనగర్ జిలాల్లోని మల్లాపూర్ మండలం హుస్సేన్‌సాగర్‌లో గురువారం జరిగిన ప్రమాదంలో 23 మంది గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వేగంగా వస్తోన్న బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. |