ర్యాంగింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ఓ విద్యార్థిపై ర్యాంగింగ్‌కు పాల్పడిన వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో వెలుగుచూస్తున్న ర్యాంగింగ్ ఘటనలపై వైఎస్సార్ మండిపడ్డారు. ఈ ర్యాంగింగ్ ఘటనపై విచారణ జరపాలని దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇంకా మహిళలపై జరుగుతున్న దాడుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఐకమత్యంతో మెలగాలని, తల్లిదండ్రుల ఆశయసాధన కోసం శ్రమించాలని వైఎస్సార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నగరంలోని ఓ కళాశాలలో ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. శ్రవణ్ అనే విద్యార్థి గోళ్లను కత్తిరించి చేతిని బ్లేడ్‌తో కోశారు. అనంతరం నా చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ శ్రవణ్‌తో సీనియర్లు ఓ సూసైడ్ నోటు రాయించుకున్నారు. గాయపడిన విద్యార్థి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. |