గాజువాకలోని భాష్యం పాఠశాలలో చదువుతున్న పవన్ అనే విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడు. స్కూల్‌కు వెళ్లిన తన కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో పవన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ చేసిన వ్యక్తులు రూ.10లక్షలు డిమాండ్ చేశారని పవన్ తల్లిదండ్రులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై పోలీసులు కేసును నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. |