సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి శుక్రవారం సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేసం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మాట్లాడుతూ.. జిల్లాలో పర్యటించే మంత్రులు విధిగా సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు నెలలో ఒక రాత్రి హాస్టల్‌లో బసచేసి అక్కడ పరిస్థితులపై సమీక్షించాలని వైఎస్సార్ అన్నారు. ఇంకా వసతి గృహాల్లో సౌకర్యాలు ఎలా ఉంటున్నాయనే అంశంపై కూడా సమీక్షించాలని ఆయన ఆదేశించారు. |