రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో భాగంగా, సికింద్రాబాద్, తిరుపతి రైల్వేస్టేషన్లు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి ద్వారా తిరుపతి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లకు పలు అత్యాధునిక సదుపాయాలు చేకూరుతాయి.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర రైల్వే మంత్రి మమత వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖ మార్గంలో మరో డైలీ ఎక్స్‌ప్రెస్ రానుంది.
ఇకపోతే.. రాజధాని, శతాబ్ది రైళ్లలో ఇన్ఫోటైన్‌మెంట్ సేవలతో పాటు, విశాఖ-ముంబయి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, బిలాన్‌పూర్- హైదరాబాద్-తిరునల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపనున్నట్లు రైల్వే బడ్జెట్‌లో మమత ప్రకటించారు. |