రైల్వేశాఖ మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన వెంటనే ఎంపీలు ఆమె వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈసారి కూడా రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రైల్వే బడ్జెట్‌ను అవగాహన చేసుకుని, భవిష్యత్‌లో రాష్ట్రానికి మరిన్ని మంచి ప్రాజెక్టులు, అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని ఎంపీలు తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలుస్తామని ఎంపీలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక ఎంపీలనిచ్చి యూపీఏ ప్రభుత్వానికి ఇతోధికంగా బలాన్నిచ్చిందని, అందుచేత ఆంధ్ర రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని రైల్వే మంత్రి ఇంతకుముందు హామీ ఇచ్చారని ఎంపీలు ఈ సందర్భంగా ఎత్తి చూపారు. |