రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు శుక్రవారం నమోదైంది. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు శుక్రవారం గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు 19కి చేరాయి. మరోవైపు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందన్న అనుమానంతో ఆరుగురు వ్యక్తులు ఆస్పత్రిలో చేరారు. వీరికి వైద్యులు స్వైన్‌ఫ్లూ పరీక్షలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 116కు చేరుకుంది. గురువారం రాత్రికి మరో నలుగురు స్వైన్ ఫ్లూ బాధితులను కనుగొన్నారు. దీంతో దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న బాధితుల సంఖ్య 116కు చేరుకుంది. వీరిలో 80మంది రోగులను ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. |