రాష్ట్రంలో శనివారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. అలాగే, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లి వద్ద పలమనేరు వెళుతున్న స్కూలు ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు.
అలాగే ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలో లారీ-ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక మహిళతో పాటు.. ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. |