రాష్ట్రంలో వర్షాలు కురవాలని, రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన మహావరుణ యాగం పూర్ణాహుతితో సమాప్తం కానుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తితిదే గత మూడు రోజులుగా నిర్వహిస్తోన్న ఈ మహావరుణ యాగం శనివారంతో పూర్తి కానుంది. ఈ రోజు (శనివారం) పూర్ణాహుతి కార్యక్రమాన్ని తితిదే పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. వరుణయాగ ప్రారంభోత్సవంలో హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరవుతారని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉండగా.. మూడు రోజుల పాటు జరుగుతోన్న వరుణయాగంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. చివరిరోజైన శనివారం జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలు భక్తులు తరలివస్తారని తితిదే అంచనా వేస్తోంది. |