కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు నర్సింగ్ కాలేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ఆదేశించారు. ఎంతో ధైర్యం చేసి విద్యార్థినులే స్వయంగా ఫిర్యాదు చేయడాన్ని మంత్రి అభినందించారు. డబ్బులు తసుకుని ఫిర్యాదు చేశారన్న రామారావు వ్యాఖ్యలపై సబిత సీరియస్‌గా స్పందించారు.
డబ్బుల కోసం ఏ ఆడపిల్ల అయినా తన జీవితాన్ని నాశనం చేసుకోదని మంత్రి అన్నారు. కేసు సీఐడీ పరిధిలో ఉన్నందున విద్యార్థినుల విచారణను వారికే అప్పజెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఈ కేసులో విద్యార్థినులకు సరైన న్యాయం చేస్తామని సబిత హామీ ఇచ్చారు. |