ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనకదుర్గ ఆలయంలో బుధవారం ఓ ఉదంతం చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ గుడి వారధి నుంచి దూకి రాధ అనే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం దుర్గమ్మ గుడికి చేరుకున్న రాధ అమ్మవారి దర్శనం చేసుకుని గుడి ఓం టర్నింగ్ వద్ద చాలాసేపు కూర్చుని అందరూ చూస్తుండగానే కిందికి దూకింది.
ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తులో రాధ కుటుంబకలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని తెలియవచ్చింది. |