ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్ > తెదేపా అధినేతతో సమావేశమైన తలసాని
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తెదేపా అధినేతతో సమావేశమైన తలసాని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమైక్యాంధ్ర తిరుగుబాటు నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం భేటీ అయ్యారు. కొన్ని రోజులుగా తలసాని వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్లతో బాబు బుధవారం చర్చించిన విషయం తెల్సిందే. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యవహించిన తలసానిపై చర్య తీసుకునేందుకు ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ ముందు హాజరుకావాలని తలసానికి చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తలసాని చంద్రబాబుతో సమావేశం కావడం గమనార్హం. ఇదిలావుండగా, తలసాని వ్యవహారంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో పార్టీ సీనియర్‌ నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడులు ఉన్నారు.

ఈ కమిటీ ఒక్కరోజులో నివేదిక ఇవ్వాలని బాబు కోరినట్టు సమాచారం. అలాగే కమిటీ ముందు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరుకావాల్సి ఉంటుందని, ఒక వేళ హాజరు కాకపోతే ఆయనపై వేటు తప్పదని తెదేపా వర్గాలు వెల్లడించాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తలసానిపై చర్యకు ప్రత్యేక కమిటీ: తెదేపా
ఇంద్రకీలాద్రిపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్
రాష్ట్ర రాజధానికి వస్తోన్న ఆస్ట్రేలియా బృందం
ష్.. గప్‌ చిప్: నేతలకు బాబు హుకుం!