ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో... గురువారం ఆస్ట్రేలియా బృందం రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో పర్యటించనుంది.
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భద్రతపై హామీ ఇచ్చేందుకు ఆసీస్ బృందం సమావేశంకానుంది.
విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వడంతో పాటు వారి సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది. అనంతరం ప్రవాస భారతీయుల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర్ర అధికారులతో సమావేశమై దాడుల నివారణకు ఇప్పడు వరకు తీసుకున్న చర్యల వివరాలను గురించి చర్చిస్తుందని ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. |