నిన్న కేరళకు చెందిన ఓ కుర్రాడు సానియా మీర్జాను పెళ్లాడుతానన్న సంఘటన మరిచిపోక ముందే ఈరోజు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో కుర్రాడు సానియాను వివాహమాడతానని ఆమె ఇంటి ముందు తిష్ట వేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే జూలై నెలలో సానియా వివాహం జరుగనుంది. పెళ్లి పనుల్లో సానియా కుటుంబం తలమునకలై ఉంటే కొత్తగా ప్రేమపిచ్చోళ్లు వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సానియామీర్జాను వివాహమాడతామని ఆమె ఇంటి ముందు హడావుడి చేసిన ఈ ఇద్దరు యువకులు ఇంజనీరింగ్ చేసినవారై ఉండటం గమనార్హం. |