ప్రపంచ ప్రజలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. తాజాగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ మహిళలకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు, చికిత్స కోసం చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించారు. రాష్ట్రంలో గత శుక్రవారం ఓ స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు 23కి చేరాయి. ఇదిలా ఉంటే.. దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 116కు చేరుకుంది. గత గురువారం రాత్రికి మరో నలుగురు స్వైన్ ఫ్లూ బాధితులను కనుగొన్నారు. దీంతో దేశంలో స్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న బాధితుల సంఖ్య 116కు చేరుకుంది. వీరిలో 80మంది రోగులను ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. |