గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ జారీలో జాప్యం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డివిజన్ల పునర్విభజనతో పాటు.. రిజర్వేషన్లపై పలు విమర్శలు వచ్చాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఈ పునర్వభజన ఉందని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటీషన్లు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను శుక్రవారం సాయంత్రంలోగా విడుదల చేయడం అసాధ్యమని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు గురువారం నివేదించింది. ఈ నోటిఫికేషన్ తొలుత శుక్రవారమే వెలువడనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఈసీ హైకోర్టుకు ఒక నివేదికను సమర్పించింది. |