గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సూర్యుడు గుర్తును ఎన్నికల గుర్తుగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజారాజ్యం పార్టీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సూర్యుడు గుర్తు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల కమిషనర్ ఏవీఎస్.రెడ్డి గురువారం ప్రరాపా నేతలకు అందజేశారు. అంతకుముందు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులకు సూర్యుడు గుర్తుపైనే పోటీ చేసే అవకాశం కల్పించాలని కమిషనర్ ఎ.వి.ఎస్.రెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆయన ఏవీఎస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ వినతిని పరిశీలించిన ఎన్నికల కమిషనర్ ప్రజారాజ్యం అభ్యర్థులకు సూర్యుడు గుర్తును కేటాయించారు. అంతకుముందు ఈ అంశంపై చిరు మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల రిజర్వేషన్ల వ్యవహారం, వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా లేవన్నారు. అయినప్పటికీ విజయమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామన్నారు. |