రాష్ట్ర బడ్జెట్ శాసనసభ సమావేశాలు వచ్చే నెల 29వ తేదీ వరకు జరుగనున్నాయి. స్పీకర్ కిరణ్ కుమార్ అధ్యక్షత శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల పని దినాలను 26 రోజులుగా నిర్ణయించారు.
అలాగే, భూ సంస్కరణలు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, నదులపై పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, అధిక ధరలు, తెదేపా ఎమ్మెల్యే టీవీ.రామారావు అరెస్టు వ్యవహారం, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్, ప్రజారోగ్యం, చేతి వృత్తుల అంశాలపై చర్చిస్తారు.
వీటితో పాటు.. సచార్ కమిటీ నివేదిక, విదేశాల్లో భారతీయుల దాడి తదితర అంశాలపై సభలో చర్చించేందుకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపై చర్చించేందుకు ఆయా పార్టీల బలాబలాలను పరిగణంలోకి తీసుకుని సమయాన్ని కేటాయిస్తామని స్పీకర్ చెప్పారు. |