దళిత క్రిస్టియన్లా.. అయితే ఓకే: ముఖ్యమంత్రి

PNR|
File
FILE
రాష్ట్రంలోని దళిత క్రిస్టియన్లను దళితలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు సమర్థించాయి. కాగా, ఈ తీర్మానం హిందువులకు పూర్తి వ్యతిరేకం అంటూ, దాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.

అలాగే, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కూడా వ్యతిరేకించారు. మత ప్రాదిపదికన రిజర్వేషన్లు కల్పించరాదాని ఆయన సభకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ విన్నివించింది.

దీనికి అన్ని పార్టీలు ఆమోదం తెలిపితే మజ్లిస్ వినతిని కూడా తీర్మానంలో చేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే షెడ్యూల్ కులాల వారితో సమానంగా దళిత క్రిస్టియన్లకు కూడా అన్ని రకాల ప్రయోజనాలూ వర్తిస్తాయి. రిజర్వేషన్లు కూడా వారికి అందుబాటులోకి వస్తాయి.


దీనిపై మరింత చదవండి :