తొలి వార్షికం ముగిసింది: ప్రధాన కార్యదర్శి వెళ్లిపోయాడు
ప్రజారాజ్యం పార్టీ బుధవారం ప్రధమ వార్షికోత్సవాన్ని జరుపుకుని 24 గంటలు గడిచేలోపే మరో ముఖ్య నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జల్లి సిద్ధయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. రాజీనామాకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఇదిలావుండగా... "ప్రజారాజ్యంలో ఉండదలచుకున్నవారు ఉండొచ్చు.. ఉండలేనివారు వెళ్లిపోవచ్చు" అని ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఒక నేత చేసిన వ్యాఖ్యలకు కొంతమంది పీఆర్పీ నాయకులు లోలోన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీఆర్పీలో ఇటీవల కొనసాగుతూ వస్తున్న రాజీనామాల పర్వం ఇంతటితో ఆగుతుందో లేదోనన్న అంశం చర్చనీయాంశమైంది.